
చెన్నై: రామేశ్వరం వద్ద తీర ప్రాంతంలో సముంద్ర 50 అడుగులు వెనక్కు వెళ్లిపోయింది. సముద్రం హఠాత్తుగా వెనక్కి వెళ్లడంతో తీరంలో ఆగిన బోట్లు ఇసుకలో నిలిచిపోయాయి. బుధవారం ఉదయం జరిగిందీ ఘటన. ఉదయం నుంచి బలమైన ఈదురు గాలులు వీచాయి. హఠాత్తుగా సముద్రం 50 అడుగులు వెనక్కు వెళ్లిపోయింది. తీర ప్రాంతంలో అంతా బండరాళ్లు బయటకొచ్చి కనిపించాయి. హార్బర్ నుంచి సంగుమాల్ ప్రాంతం వరకు సముద్రం 50 అడుగులు వెనక్కు వెళ్లిపోయి కనిపించింది. అలాగే అగ్నితీర్థం ప్రాంతంలోనూ సముద్ర తీరంలో బండరాళ్లు బయటపడ్డాయి. హఠాత్తుగా వాతావరణంలో మార్పు కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు.