ఇండియాలోనే ఖరీదైన అపార్ట్ మెంట్ డీల్

ఇండియాలోనే ఖరీదైన అపార్ట్ మెంట్ డీల్

అపార్ట్ మెంట్లలో ఎస్.ఎఫ్.టీ .. SFT.. 5 వేలు, 10 వేలు, 15 వేలు, 20 వేలు అంటేనే అమ్మో అని నోరెళ్లబెడుతున్నాం.. ఇంత ధర ఏంటీ అంటూ మండిపడతాం.. అక్కడ మాత్రం స్కైర్ ఫీట్ ఏకంగా ఒక లక్షా 40 వేల రూపాయలు పలికింది. ఇండియాలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఖరీదైన అపార్ట్ మెంట్ డీల్ గా.. ఇది హిస్టరీ క్రియేట్ చేసింది. ముంబైలో జరిగిన ఈ డీల్ వివరాలు ఇలా ఉన్నాయి.

సౌత్ ముంబై సిటీలోని వాలేశ్వర్ ఏరియాలో రాజ్ భవన్ సమీపంలో..  భారీ టవర్ నిర్మాణం జరుగుతుంది. ట్రిప్లెక్స్ ఆల్ట్రా లగ్జరీగా రూపుదిద్దుకుంటుంది. ఈ టవర్ లోని మొదటి మూడు అంతస్తుల్లోని.. 18 వేల స్కైర్ ఫీట్ ఫ్లాట్ కోసం.. ఏకంగా 252 కోట్ల రూపాయలు చెల్లించారు నీరజ్ బజాబ్. ఈ టవర్ ను లోధా గ్రూప్ నిర్మిస్తుంది. ఈ లెక్కన ఒక్కో స్కైర్ ఫీట్ లక్షా 40 వేల రూపాయలు పడినట్లు రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో అత్యధిక ధరగా ఇది రికార్డ్ సృష్టించింది. 

2023, ఫిబ్రవరి నెలలోనే ముంబైలోని వర్లీ లగ్జరీ టవర్ లో 30 వేల చదరపు అడుగుల పెంట్ హౌస్ ఫ్లాట్ ను 240 కోట్ల రూపాయలకు వ్యాపారవేత్త గోయెంకా కొనుగోలు చేశారు. అప్పట్లో ఇదే అతి పెద్ద డీల్ గా చెప్పుకొచ్చారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే.. అంతకు మించిన అతి పెద్ద డీల్ జరగటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. స్కైర్ ఫీట్ లక్షా 40 వేల రూపాయలు అనేది.. ఇండియాలోనే ఇప్పటి వరకు జరగలేదని.. ఇదే ఫస్ట్ టైం అంటున్నారు వ్యాపారులు. 

వాలేశ్వర్ ప్రాంతంలో లోధా గ్రూప్.. అతి పెద్ద రెసిడెన్షియల్ టవర్ ప్రాజెక్టు చేపట్టింది.ఈ ప్రాజెక్టులోనే బజాజ్ ఆటో చైర్మన్.. బజాజ్ గ్రూప్ ప్రమోటర్ డైరెక్టర్ అయిన నీరజ్ బజాజ్ అడ్వాన్స్ కూడా చెల్లించారు. ముంబై కార్పొరేషన్ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మిగతా మొత్తం చెల్లించే విధంగా అగ్రిమెంట్ అయినట్లు చెబుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. 

ఇటీవల కాలంలో ముంబైలో లగ్జరీ అపార్ట్ మెంట్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. వరసగా బిగ్ డీల్స్ జరుగుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే 30, 40 అంతస్తుల హైరైజ్ టవర్స్ నిర్మాణాలు ఊపందుకున్నాయి. బడా పారిశ్రామికవేత్తలు అందరూ అపార్ట్ మెంట్స్ లో లగ్జరీ ఫ్లాట్ల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపటంతో.. 2023 సంవత్సరం జనవరి , ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే.. దేశంలోని అతి పెద్ద అపార్ట్ మెంట్ డీల్స్ ముంబైలో జరగటం విశేషం.