జేఈఈ, నీట్‌పై సుప్రీంకు వెళ్దాం.. 7 రాష్ట్రాల సీఎంల నిర్ణయం

జేఈఈ, నీట్‌పై సుప్రీంకు వెళ్దాం.. 7 రాష్ట్రాల సీఎంల నిర్ణయం

న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ (జేఈఈ), నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను సెప్టెంబర్‌‌లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా తప్పుబట్టారు. స్టూడెంట్స్‌ ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆమె మండిపడ్డారు. ఈ విషయంపై ఏడు రాష్ట్రాల సీఎంలతో బుధవారం నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌ సమావేశంలో సోనియా పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ భగేల్‌తోపాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి పాల్గొన్నారు.

సీఎంలతో సమావేశంలో జేఈఈ, నీట్‌తోపాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపైనా సోనియా చర్చించారని తెలిసింది. స్టూడెంట్స్‌ హెల్త్‌ గురించి పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ‘అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది నా మనవి.. మనం కలసి ఉందాం, ఈ విషయంపై సుప్రీం కోర్టుకు వెళ్లి పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యేలా పోరాడుదాం’ అని మీటింగ్‌లో పాల్గొన్న మాయావతి చెప్పారు. మాయావతి వ్యాఖ్యలకు అమరిందర్ సింగ్ మద్దతుగా నిలిచారని సమాచారం. యూఎస్‌లో స్కూళ్లు రీఓపెన్ అయ్యాక దాదాపు 97 వేల మంది పిల్లలు కరోనా బారిన పడ్డ విషయాన్ని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. అలాంటి పరిస్థితే ఇండియాలో తలెత్తితే ఎలాగని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.