69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి.. అదిరేలుక్లో అవార్డు గ్రహీతలు

69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి.. అదిరేలుక్లో అవార్డు గ్రహీతలు

69వ జాతీయ అవార్డులను(69National Film Awards 2023) ఇవాళ (2023 అక్టోబరు 17) ఢిల్లీలో రాష్టపతి ద్రౌపది ముర్ము(Droupadhi Murmu) చేతుల మీదుగా ఈ అవార్డుల కార్యక్రమం ఘనంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్నాయి, ఇక్కడ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మక అవార్డును అందజేయనున్నారు. వివిధ భాషల నుంచి సెలెక్ట్ అయిన హీరోస్, హీరోయిన్స్, పలు టెక్నికల్ విభాగాలకు సంబంధించిన వారు తమదైన వేషధారణతో కనిపించి శభాష్ అనిపించుకున్నారు. 

ఒక్కసారి అందరిని గమనిస్తే వారంతా ఒకే డ్రెస్ లో వచ్చారనే విషయం అర్ధం అవుతుంది. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్( Allu Arjun)..బ్రౌన్ సల్వార్ వైట్ సూట్ ధరించి..కళ్ళజోడుతో ..సింపుల్ స్టైలిష్ లుక్ లో కనిపించారు.

అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్(Alia Bhatt)..గంగూబాయి కతియావాడి మూవీలో తనదైన నటనతో ఆకట్టుకోగా..ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును అందుకున్నారు. అలియా లైట్ మట్టి గోధుమ రంగుతో కూడిన శారీలో..మెడకు లైట్ బ్రౌన్ గోల్డ్ నెక్లెస్ తో కనిపించి..తనదైన మెస్మరైజింగ్ స్మైల్ తో ఆకట్టుకుంది.

Also Read :- బిగ్​బాస్​కి వెళ్లినా వీడని ముద్దు వివాదం

అలాగే మరోనటి అయిన కృతి సనన్(Kriti Sanon) నటించిన మిమి చిత్రానికి గానూ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డును అందుకుంది. కృతి సనన్ కూడా లైట్ గోధుమ కలర్ డ్రెస్ లో కనిపించిన తీరుకి గాను వావ్ అనేలా ఉంది.

వీరితో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా నిలిచిన వహీదా రెహ్మాన్(Waheeda Rehman).. మిమీ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడుగా అవార్డును గెలుచుకున్న పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi) కూడా లైట్ గోధుమ రంగు కలర్ డ్రెస్ లో కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.