న్యూజెర్సీలో ‘ఆటా’ డ్యాన్స్​ పోటీలు

న్యూజెర్సీలో ‘ఆటా’ డ్యాన్స్​ పోటీలు

హైదరాబాద్, వెలుగు: అమెరికా తెలుగు సంఘం(ఆటా) 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. సయ్యంది పాదం ఇన్​చార్జ్​లు ఇందిరా దీక్షిత్, మాధవి అరువ ఆధ్వర్యంలో కూచిపూడి, భరత నాట్యం, జానపదం, ఫిల్మ్ విభాగాల్లో కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఆటా 17వ కన్వెన్షన్ అండ్​ యూత్ కాన్ఫరెన్స్ జులై 1 నుంచి 3వ తేదీ వరకు వాషింగ్టన్ డీసీలో జరగనుంది. వివిధ కమిటీల ఆధ్వర్యంలో జరిగే ఆటా మహాసభలకు తెలుగువాళ్లు భారీ స్థాయిలో హాజరై విజయవంతం చేయాలని ఆటా అధ్యక్షుడు భువనేశ్​ బూజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు కోరారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తన ట్రూప్​తో జులై 3న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్, సినీ నటులు విజయ్ దేవరకొండ, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, రామ్ మిర్యాల, మంగ్లీ, క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరుకానున్నట్టు తెలిపారు. జులై 2న సంగీత దర్శకుడు తమన్ సంగీత కచేరీ ఇవ్వనున్నారు.