
Ather Energy IPO: చాలా కాలం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో కొంత ఐపీవోల కోలాహలం తిరిగి స్టార్ట్ అయ్యింది. ఈవారం కొన్ని ఐపీవోల లిస్టింగులతో పాటు మరికొన్ని ఇష్యూల ప్రారంభం కూడా ఉన్నాయి. మార్కెట్ల ఒడిదొడుకుల సమయంలో వస్తున్న ఐపీవోలు కొంత ఇన్వెస్టర్లకు నిరాశాజనకమైన రాబడులను అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఏథర్ ఎనర్జీ ఐపీవో గురించే. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీ చాలా కాలంగా మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్ జరగగా ప్రస్తుతం ఇదే రంగానికి చెందిన ఏథర్ మార్కెట్లోకి అరంగేంట్రం చేసింది. అయితే మెయిన్ బోర్డ్ ఐపీవోగా వచ్చినప్పటికీ తొలిరోజు మ్యూటెడ్ లిస్టింగ్ నమోదు చేయటంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురవుతున్నారు. ఊహించిన స్థాయిలో లిస్టింగ్ గెయిన్స్ రాకపోవటం నిరాశను మిగిల్చింది.
ఎన్ఎస్ఈలో ఏథర్ ఎనర్జీ షేర్లు ఒక్కోటి స్వల్పంగా 2 శాతం ప్రీమియంతో రూ.328వద్ద లిస్టింగ్ అయ్యింది. ఇక బీఎస్ఈలో స్టాక్ 1.57 శాతం లాభంతో ఇష్యూ ధర కంటే స్వల్పంగా లాభంతో ఒక్కోటి రూ.326.05 వద్ద ప్రయాణాన్ని మెుదలుపెట్టింది. వాస్తవానికి కంపెనీ తన ఐపీవో గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.321 వద్ద విక్రయానికి ఉంచింది.ఐపీవోలో పందెం వేసేందుకు లాట్ కోసం రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.14వేల 766 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. అలాగే కంపెనీ తన ఉద్యోగులకు ఐపీవోలో షేర్లను ఒక్కోటి రూ.30 తగ్గింపు ధరకు అందించింది.
Also Read:-పసిడి ప్రియులకు షాక్.. నేడు ఊహించనంత పెరిగిన గోల్డ్, హైదరాబాదులో తులం..
కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2వేల 981 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో 8.18 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించగా.. 1.11 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయానికి ఉంచింది. అలాగే లిస్టింగ్ ముందు గ్రేమార్కెట్లో షేర్లు రూ.14 ప్రీమియం ధరను కలిగి ఉన్నప్పటికీ.. తర్వాత జాబితా సమయానికి ఇది సగానికి తగ్గి ఒక్కో షేరుకు రూ.7గా నిలిచింది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.