
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో AA22xA6 (వర్కింగ్ టైటిల్) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం AA22 ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించి డైరెక్టర్ అట్లీ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
ఇటీవలే డైరెక్టర్ అట్లీ బెంగళూరులో జరిగిన పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. అక్కడ అట్లీని మీడియా ‘AA22xA6’ సినిమాపై పలు ప్రశ్నలు అడిగింది. ఈ క్రమంలో అట్లీ, మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చారు. ‘‘AA22xA6 ప్రేక్షకుల ఊహకి అందనంతగా ఉండబోతుంది. ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. ఈ జానర్‌కు ప్రత్యేకమైన మార్గదర్శకాలు లేవు. కనుక మేమే కొత్తదారిని క్రియేట్ చేస్తూ వెళ్తున్నాం. అందుకు దేవుడు కూడా మా జర్నీలో ప్రతి అడుగులోనూ తోడున్నాడని అట్లీ చెప్పుకొచ్చారు.
అలాగే ఇంత భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తుండటం రిస్క్‌గా అనుకోవడం లేదా అనే ప్రశ్నకు సమాధానంగా.. అట్లీ బదులిస్తూ..‘ ఇది నాకు రిస్క్ కాదు, నేను ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తూ తెరకెక్కిస్తున్నాను. ఈ సినిమా కోసం ఇంటెర్నేషనల్ టెక్నీషియన్స్ సవాలుగా తీసుకుని పనిచేస్తున్నారు. మరి కొన్ని నెలల్లో, మీరు కూడా AA22xA6ని ఆస్వాదిస్తారు.. సినీ ఫ్యాన్స్కి నచ్చేలా ఏదైనా చేస్తానని’’ అట్లీ తెలిపారు.
►ALSO READ | Vijay Devarakonda: వీడీ-కోలా మాస్ తాండవం షురూ.. ఘనంగా ‘రౌడీ జనార్దన్’ పూజా ఈవెంట్
ఇపుడు ఈ కామెంట్స్ ఐకాన్ అభిమానుల్లో కొత్త జోష్ని నింపుతున్నాయి . రాజా రాణి, తేరి, మెర్సల్, బిగిల్ మరియు జవాన్ సినిమాలతో ఆకట్టుకున్న అట్లీ.. AA22xA6 ఇంటర్నేషనల్ సినిమా వేదికపై జెండా పాతనున్నాడు. అల్లు అర్జున్ స్వాగ్.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటే మేనియా.. పుష్ప 2తో ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఈ క్రమంలో AA22xA6 ప్రపంచ రికార్డులు కొల్లగొట్టడానికి ఆస్కారం ఉంది. ఏమవుతుందో చూడాలి!
Sun Pictures 🤝 @alluarjun 🤝 @Atlee_dir
— Sun Pictures (@sunpictures) April 8, 2025
Crossing Borders. Building Worlds. 💥🔥#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥
🔗 - https://t.co/NROyA23k7g#AA22 #A6 #SunPictures pic.twitter.com/2Cr3FGJ9eM
ఇదిలా ఉంటే, ఇటీవలే, అట్లీ బృందం ముంబైలో కీలక షెడ్యూల్ ముగించుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ అబుదాబిలో ప్లాన్ చేశాడు అట్లీ. ప్రస్తుతం ఇక్కడ పలు ఇంట్రెస్టింగ్ లొకేషన్ల వేటలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ చివర్లో కొత్త షెడ్యూల్ షురూ చేసే అవకాశం ఉంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణే కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే విజయ్ సేతుపతి, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. త్వరలో మేకర్స్ నుంచి ఓ స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.