ఆక్స్​ఫర్డ్​ డిక్షనరీలోకి ‘ఆత్మనిర్భరత’

ఆక్స్​ఫర్డ్​ డిక్షనరీలోకి ‘ఆత్మనిర్భరత’

లండన్​: ఆక్స్​ఫర్డ్​ డిక్షనరీలో ‘ఆత్మనిర్భరత’ (స్వయంసమృద్ధి) పదానికి చోటు దక్కింది. ఎంతో మంది ఇండియన్లు కరోనా సమయంలో సాధించిన విజయాలకు ఈ పదం సూచిక అని పేర్కొంది. ఆక్స్​ఫర్డ్​ లాంగ్వేజెస్​ ఎక్స్​పర్టులు కృతిక అగ్రవాల్​, పూనమ్​ నిగమ్​ సహాయ్​, ఇమోజెన్​ఫాక్సెల్​తో కూడిన అడ్వైజరీ ప్యానెల్​ఆత్మనిర్భరత ‘హిందీ వర్డ్​ ఆఫ్​ ది ఇయర్​’గా ఎంపిక చేసింది. ఇండియాలో గత ఏడాదిలో పరిస్థితులను, సంస్కృతిని వర్ణించడానికి ఈ వర్డ్​ బాగా సరిపోతుందని పేర్కొంది. కరోనా తెచ్చిన కష్టాల నుంచి బయటపడటానికి ప్రధాని మోడీ కూడా ‘ఆత్మనిర్భర్​ ప్యాకేజీ’ని ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నిరంగాల్లోనూ ఇండియా స్వయంసమృద్ధి సాధించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

For More News..

ఢిల్లీ బ్లాస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో దొరికిన లెటర్‌‌‌‌‌లో ఏముందంటే?

ఐసీసీ అవార్డు రేసులో పంత్

మా బండ్లలో డీజిల్ పోయిస్తే.. నీ బిడ్డను వెతుకుతం