చేతులు వీరిగేలా ... అటవీ శాఖ అధికారులపై దాడులు

 చేతులు వీరిగేలా ... అటవీ శాఖ అధికారులపై దాడులు

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కల్పోల్ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులపై కొందరు గిరిజనుల దాడికి దిగారు. ఈ ఘటనలో అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. అటవీశాఖకు సంబంధించిన పొడు భూముల ఆక్రమణ విషయంలో దాడి జరిగినట్టు సమాచారం. సౌత్ అటవీశాఖ రేంజ్ అధికారి రాధిక, అటవీశాఖ బీట్ అధికారులు బైరాపూర్ ప్రగత్, బద్రి, సెక్షన్ అధికారి సాయి కృష్ణలకు చేతులు విరిగాయి.  అలాగే మహిళ అధికారిణికి తీవ్ర గాయాలయ్యాయి.  ఈ ఘటనపై సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.