తొగుట (దౌల్తాబాద్), వెలుగు: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్మండలం ముత్యంపేట గ్రామ సర్పంచ్ తోడంగి సునీత, ఆమె భర్త స్వామిపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీనిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దౌల్తాబాద్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఆఫీస్‌లో గ్రామ అభివృద్ధి పనులపై వార్డు సభ్యులతో కలిసి చర్చిస్తుండగా అదే గ్రామానికి చెందిన తోడంగి స్వామి, రామయ్య, తోడంగి రాజు తదితరులు.. తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గ్రామ కార్యాలయం నుంచి బయటకు లాగి అవమానించారని ఆరోపించారు. తమకు ప్రాణహాని కలిగిస్తామని బెదిరిస్తున్నారని సర్పంచ్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
