పోలీస్​ కాన్వాయ్‌‌‌‌పై కాల్పులు.. 13 మంది మృతి

పోలీస్​ కాన్వాయ్‌‌‌‌పై కాల్పులు.. 13 మంది మృతి
  • మెక్సికోలో డ్రగ్స్‌‌ గ్యాంగ్‌‌ అరాచకం

మెక్సికో: సెంట్రల్‌‌‌‌ మెక్సికో సిటీలో ఓ పోలీస్‌‌‌‌ కాన్వాయ్‌‌‌‌పై డ్రగ్స్‌‌ గ్యాంగ్‌‌ అకస్మాత్తుగా దాడి చేసింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడిలో 13 మంది పోలీసులు మరణించారు. మెక్సికో రాష్ట్రంలోని కోటెపెక్ హరినాస్ మునిసిపాలిటీలో గురువారం పోలీసులు పెట్రోలింగ్‌‌‌‌ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ దాడికి ఏ గ్రూప్‌‌‌‌ తెగబడిందో అధికారులు ఇంకా వెల్లడించలేదు. అటాక్‌‌‌‌ చేసిన వారికోసం సెక్యూరిటీ బలగాలు గాలిస్తున్నాయి. ఎక్కువగా డ్రగ్స్‌‌ గ్యాంగ్స్‌‌ ఉండే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ హింస జరుగుతూనే ఉంటుంది. ఇక్కడి డ్రగ్స్‌‌ గ్యాంగ్స్‌‌‌‌ను లేకుండా చేయడానికి 2006లో ప్రభుత్వం ఆర్మీని దింపింది. అప్పటి నుంచి ఇక్కడ సుమారు 3 లక్షల మంది ప్రజలు హత్యకు గురయ్యారు.