గాజాపై దాడులు కొనసాగుతాయి: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

గాజాపై దాడులు కొనసాగుతాయి: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

గాజాపై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ గాజాలో తన గ్రౌండ్ ఆపరేషన్ ను విస్తరిస్తుంది.. వాయు, సముద్రం నుంచి భారీ దాడులకు మద్దతుగా యుద్ధ ట్యాంకులు, పదాతి దళాన్ని పంపుతున్నామని  ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గల్లంట్ శనివారం(అక్టోబర్28) ప్రకటించారు. 

హమాస్ సొరంగాలు, మైలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్ లో రాత్రిపూట దాడులు ఉంటాయని తెలిపారు. గత మూడు వారాలుగా గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో వేలల్లో పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సొరంగాలే లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడుతోంది. 

అక్టోబర్7 ఇజ్రాయిల్ పై హమాస్ దాడుల తర్వాత గాజాలో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 7వేల 700 మంది పాలస్తీనియన్లు మరణించారు. శుక్రవారం జరిగిన దాడుల్లో 377 మంది మరణించారు. మరణించిన వారిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు  అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

గాజాపై ఇంకా దాడులు కొనసాగుతాయి..గాజాలో తన గ్రౌండ్ ఆపరేషన్ ను విస్తరిస్తుంది..వాయు, సముద్రం నుంచి భూతల మార్గాల్లో దాడుల చేస్తామని.. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.