ఉక్రెయిన్​పై ఆగని దాడులు

ఉక్రెయిన్​పై ఆగని దాడులు

ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం 14వ రోజుకు చేరుకుంది. ప్రజలను తరలించేందుకు గ్రీన్​ కారిడార్​లను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. రాజధాని కీవ్​, సూమీ వంటి నగరాలపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఇటు ఉక్రెయిన్​ సైనికులూ రాజధాని చుట్టూ గట్టి బందోబస్తుతో కాచుకుని ఉన్నారు. సూమీలో మంగళవారం అర్ధరాత్రి రష్యా జరిపిన దాడుల్లో 22 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్​ వెల్లడించింది.  రష్యా దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రైవేట్​కార్లలో నగరం విడిచి పారిపోతున్నారని సూమీ మేయర్​ అలెగ్జాండర్ ​ లైషెంకో చెప్పారు. లుగాన్స్​క్​లోనూ బుధవారం సాయంత్రం భారీ పేలుళ్లు జరిగాయి. జైటోమిర్​లోని ఓ డార్మిటరీపై రష్యా దాడిలో నలుగురు చనిపోయారు. సెవెరోడొనెట్స్క్​లో 10మంది చనిపోయారు. ఖార్కివ్​లోనూ దాడులు కొనసాగుతున్నాయి. 

12 వేల మంది రష్యా సైనికులు చనిపోయిన్రు
యుద్ధంలో 12 వేల మంది రష్యా సైనికులు చనిపోయినట్టు ఉక్రెయిన్​ ప్రకటించింది. 49 ఎయిర్​క్రాఫ్ట్స్​, 81 హెలికాప్టర్లు, 317 యుద్ధ ట్యాంకులు, 60 సిస్టర్న్​లు, 7 డ్రోన్లు, 1,070 సాయుధ సైనిక వాహనాలు, 120 ఫిరంగులు, 56 రాకెట్​ లాంచర్లు, 482 వాహనాలు, 3 వార్​షిప్స్​, 28యుద్ధ విమాన విధ్వంసక క్షిపణి  వ్యవస్థలు నాశనమయ్యాయని తెలిపింది.