తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపంతో..

 తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపంతో..

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. గాంధీనగర్ కి చెందిన జాహ్నవి అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది.  ఫస్ట్ ఇంటర్ ఫలితాల్లో జాహ్నవికి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో మనస్తాపంలో విద్యార్థిని రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నట్టు బంధువులు చెప్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు.

హన్మకొండలో..

హన్మకొండ జిల్లా కమలాపూర్ లోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిలవడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని హాస్టల్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలు కావడంతో ఉపాధ్యాయులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.