మొదటి వెయ్యి మంది కస్టమర్లకు రూ.99,999 కే

మొదటి వెయ్యి మంది కస్టమర్లకు రూ.99,999 కే
  • ‘ఆటమ్‌ వేడార్‌’ వచ్చేసింది!‌
  • మొదటి వెయ్యి మంది కస్టమర్లకు రూ.99,999 కే

హైదరబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్లను తయారుచేసే హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ఆటమ్‌మొబైల్‌‌  హైస్పీడ్ బైక్ ‘ఆటమ్‌‌ వేడార్‌‌‌‌’ ను లాంచ్ చేసింది. కెఫే రేసర్‌‌‌‌ స్టైల్‌‌లో ఈ ఎలక్ట్రిక్ బైక్‌‌ను తీసుకొచ్చారు. ఈ బైక్‌‌లో 2.4 కిలో వాట్స్‌‌ బ్యాటరీ ప్యాక్‌‌ను అమర్చారు. ఫుల్ ఛార్జ్‌‌పై 100 కి.మీ వరకు, గంటకు 65 కి.మీ స్పీడ్‌‌తో వెళుతుందని ఆటమ్‌మొబైల్ పేర్కొంది. ఈ బైక్‌‌ను మొదటి 1,000 మంది కస్టమర్లకు రూ. 99,999 కే అమ్ముతున్నారు. రూ.999 కట్టి ప్రీ–బుకింగ్ చేసుకోవచ్చు. పటాన్‌‌చెరు ప్లాంట్‌‌లో ఈ బైక్‌‌ను తయారుచేస్తున్నామని కంపెనీ పేర్కొంది. గత కొంత కాలం నుంచి ఆటమ్ వేడార్‌‌‌‌ తయారీలో ఉన్నామని,  కల నెరవేరుతుంటే గర్వంగా అనిపిస్తోందని ఆటమ్‌మొబైల్ ఫౌండర్‌‌‌‌ వంశీ జీ కృష్ణ ఈ సందర్భంగా అన్నారు.  ఆటమ్ వేడార్‌‌‌‌లో ఆఫ్ రోడ్‌‌ అవసరాల కోసం క్వాలిటీ టైర్లను, సేఫ్టీ స్విచ్‌‌లను అమర్చామని, దేశంలోని రోడ్లను, రైడర్లను దృష్టిలో పెట్టుకొని ఈ బైక్‌‌ను డెవలప్‌‌ చేశామని చెప్పారు.