
హైదరాబాద్, వెలుగు: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్ఎఫ్బీ), ఎల్ఐసీ దేశవ్యాప్తంగా జీవిత బీమా సేవలను విస్తరించడానికి ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా, ఎల్ఐసీ సమగ్ర జీవిత బీమా ఉత్పత్తులు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నెట్‌వర్క్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో బీమా సేవలను అందించడం ద్వారా "అందరికీ బీమా 2047" అనే జాతీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడుతుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన 2,456 బ్యాంకింగ్ టచ్‌పాయింట్ల ద్వారా ఎల్ఐసీ టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ ప్లాన్‌లు, హోల్ లైఫ్ పాలసీలు, పెన్షన్, యాన్యుటీ ఉత్పత్తులతో సహా అనేక రకాల జీవిత బీమా పరిష్కారాలను అందిస్తుంది.