
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలలో శుక్రవారం (మూడో రోజు) హెచ్ఎండీఏ 60 ప్లాట్లు వేలం వేసింది. దీంతో సర్కారుకు రూ.132.97 కోట్ల ఆదాయం వచ్చింది. గజం ధర అత్యధికంగా రూ.76 వేలు, అత్యల్పంగా రూ.55 వేలు, యావరేజ్ గా రూ.64,159 పలికినట్లు హెచ్ ఎం డీ ఏ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మూడు రోజుల వేలంలో 178 ప్లాట్లు వేలం వేయగా రూ.388.11 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన 120 ప్లాట్లకు సోమ, మంగళవారాల్లో వేలం జరగనుంది.