9999 నంబర్ రూ.10 లక్షలకు సేల్

9999 నంబర్ రూ.10 లక్షలకు సేల్
  • ఫ్యాన్సీ నంబర్ల వేలంతో 18లక్షల ఇన్ కమ్

హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ ఆర్టీఏ( సెంట్రల్ జోన్ )లో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంతో  రూ.18,02,970 లక్షల ఇన్ కమ్ వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండు రంగనాయక్ వెల్లడించారు. టీఎస్ 11ఈజెడ్ 9999 నంబర్ రూ.9,99,999 కు చర్చ్ ఎడ్యుకేషనల్ సోసైటీ కొనుగోలు చేసిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. 

టీఎస్ 11 ఎఫ్ఏ 0001 నంబర్ రూ.3లక్షలకు కామినేని సాయి శివనాగ్, టీఎస్ 11 ఎఫ్ఏ 0011 నంబర్ రూ.1,55,400 కు సామ రోహిత్ రెడ్డి దక్కించుకున్నారన్నారు.  టీఎస్ 11 ఎఫ్ఏ 0007 నంబర్ రూ.80,100కు,  టీఎస్ 11ఈజెడ్ 9990 నంబర్ రూ.55,990 ,  టీఎస్ 11ఎఫ్ఏ 0027 నంబర్ రూ.36,059 , టీఎస్ 11ఈజెడ్ 0015 నంబర్ రూ.16,111 కు దక్కించుకున్నారని జేటీసీ పేర్కొన్నారు.