ఖైరతాబాద్ ఆర్టీఏలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం

ఖైరతాబాద్ ఆర్టీఏలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం

హైదరాబాద్, వెలుగు : ఖైరతాబాద్ ఆర్టీఏలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా రూ.47,52,424 ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్​ పాండురంగ నాయక్ తెలిపారు. టీఎస్ 09 ఎఫ్ వై 9999 నంబర్​ను ఆదిత్య బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.15,00,100కు, టీఎస్ 09 ఏజెడ్ 0099 సుశీ ఇన్ ఫ్రా, మైనింగ్ లిమిటెడ్, టీఎస్ 09 ఎఫ్ జెడ్ 0001 నంబర్ ను చలసాని సౌమ్యు ఆక్షన్​లో కొన్నట్లు ఆయన వెల్లడించారు.