తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు రాఖీ పౌర్ణమి వేడుకలు.. రక్ష కట్టేది సమయాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు రాఖీ పౌర్ణమి వేడుకలు.. రక్ష కట్టేది సమయాలు ఇవే..

రాఖీ పండుగ ప్రతీ ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం అధిక శ్రావణ మాసాలు రావటంతో ఓ విశేషమైతే..రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి..? అనేది కూడా ఓ ప్రశ్నార్థకంగా మారింది. పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలోనే సోదరులకు రాఖీ కట్టాలి. కానీ ఏడాది  మాత్రం పౌర్ణమి ఏ రోజున వచ్చింది.. పౌర్ణమి ఘడియలు  ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి ? రాఖీ పౌర్ణమి ఆగస్టు  30నా, 31నా అనే పెద్ద సందేహం వచ్చింది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 30, 31  రెండు రోజుల్లో రాఖీ పండుగు జరుపుకుంటున్నారు.  

హిందూ క్యాలుండర్ ప్రకారం రాఖీ  30,31 రెండు తేదీలలో వచ్చింది.  30న పౌర్ణమి గడియలు ఉన్నప్పటికి రాత్రి  9.01 వరకు  భద్రకాలం ఉందట. భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదంటున్నారు. అలా కడితే దోషమని..భధ్ర కాల ప్రభావం వారి(సోదరులపై)పై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. భద్రకాలంలో రాఖీ అస్సలు కట్టకూడదని పండితులు  సూచిస్తున్నారు. అందువలన 30 వ తేదీ రాత్రి 9 .02 గంటల నుంచి  31వ తేదీ ఉదయం 07.05 నిమిషాల వరకు రక్షాబంధనం కట్టవచ్చని సూచిస్తున్నారు.  

అక్కచెల్లెళ్లుఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చట. ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుంది. పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు, సమస్యలు వస్తాయని చెబుతున్నారు. 

ఆగస్టు 31న రాఖీ కట్టేందుకు  ముహూర్త సమయం

  • ఉదయం 5:58 నుంచి ఉదయం 7:34  గంటల లోపు
  • మధ్యాహ్నం 12: 21 నుంచి మధ్యాహ్నం 3:32 గంటల లోపు
  • సాయంత్రం 5:08 నుంచి రాత్రి 8: 08 గంటల లోపు రాఖీ కట్టవచ్చు