20లోగా ఆగస్టు కోటా యూరియా సప్లై చేయాలి.. కంపెనీలకు అగ్రికల్చర్ డైరెక్టర్ ఆదేశం

20లోగా ఆగస్టు కోటా యూరియా సప్లై చేయాలి.. కంపెనీలకు అగ్రికల్చర్ డైరెక్టర్ ఆదేశం
  • ఈ నెల కోటా కింద కేంద్రం 1.70 లక్షల టన్నుల యూరియా ఇచ్చిందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కేంద్రం ఆగస్టు నెలకు కేటాయించిన యూరియా కోటాను 20వ తేదీ లోపు సరఫరా చేయాలని ఎరువుల కంపెనీలను అగ్రికల్చర్​ డైరెక్టర్​ డాక్టర్​ బి.గోపి ఆదేశించారు. యూరియా సరఫరా కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం (ఆగస్టు 01) డైరెక్టర్​ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం ఈ నెలకు 1.70 లక్షల టన్నుల యూరియా పంపిణీ చేసిందని తెలిపారు. 

దాన్ని 20 రోజుల్లోగా సరఫరా చేయాలని సూచించారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి జాప్యం జరగరాదన్నారు. ఆగస్టు నెలలో వరినాట్లు ఎక్కువగా వేసే అవకాశం ఉన్నందున యూరియా వినియోగం అధికంగా ఉంటుందని,   టైంకు సప్లై చేసేలా చూడాలన్నారు.