ఆంగ్సాన్ సూకీకి శిక్ష తగ్గింపు

 ఆంగ్సాన్ సూకీకి శిక్ష తగ్గింపు

బ్యాంకాక్: మయన్మార్ నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీకి ఆరేండ్ల శిక్ష తగ్గనుంది. బౌద్ధ పండగ సందర్భంగా మయన్మార్ మిలటరీ సర్కార్ 7 వేల మందికి పైగా ఖైదీలకు శిక్ష తగ్గించిం ది. దాంతో సూకీకి ఆరేండ్ల శిక్ష, మాజీ అధ్యక్షుడు విన్ మైంట్​కు నాలుగేండ్ల శిక్ష  తగ్గనుందని మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ వెల్లడించారు. 


సూకీపై నమోదైన 5 కేసుల్లో శిక్షను తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. సూకీని 19కి పైగా కేసుల్లో దోషిగా తేల్చిన మయన్మార్ కోర్టు ఆమెకు 33 ఏండ్ల జైలు శిక్ష విధించింది. తాజా తగ్గింపు తర్వాత ఇంకా 27 ఏండ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దేశంలో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు సూకీని తొలిసారి 1989లో గృహ నిర్బంధంలో ఉంచారు. 


ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేసినందుకు ఆమెను 1991లో నోబెల్ బహుమతి వరించింది. 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో  సూకీ పార్టీ వరుసగా విజయం సాధించింది.