లాక్ డౌన్ ఉన్నా అనుకున్న టైంకే పెళ్లి.. ఎలా చేసుకున్నారో తెలిస్తే..

లాక్ డౌన్ ఉన్నా అనుకున్న టైంకే పెళ్లి.. ఎలా చేసుకున్నారో తెలిస్తే..

కరోనా వైరస్ వల్ల దేశమంతా 21 రోజుల లాక్ డౌన్ లో ఉంది. దాంతో వీడియో కాల్ ద్వారా తామనుకున్న రోజే తమ పిల్లల పెళ్ళి చేశారు ఇరు కుటుంబాల పెద్దలు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలవుతుండటంతో ఏ ఒక్కరూ ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే ఓ జంట మాత్రం లాక్ డౌన్ వల్ల తమ పెళ్లిని వాయిదా వేయాలనుకోలేదు. ముందనుకున్న ప్రకారం నిర్ణయించిన రోజే పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. కుటుంబ పెద్దల సమక్షంలో ఎవరి ఇంట్లో వాళ్లుండి తమ పెళ్లి చేసుకున్నారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన మహ్మద్ మిన్హాజుద్ కు అదే ప్రాంతానికి చెందిన మహిళతో 6 నెలల క్రితం పెళ్లి నిశ్చయించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రధాని మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించారు. దాంతో ఫంక్షన్ హాల్స్ కూడా మూతపడ్డాయి. ఇక వారి పెళ్లి వాయిదాపడ్డట్లేనని అందరూ అనుకున్నారు. కానీ, వారు మాత్రం ఎలాగైన అనుకున్న టైంకే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తమ తమ కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో.. ఒకరినొకరు వీడియో కాల్ లో చూస్తూ పెళ్లి చేసుకున్నారు.

ఈ పెళ్లి గురించి వరుడి తండ్రి మొహమ్మద్ గయాజ్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ మన దేశంలో లేనప్పుడు ఈ పెళ్లి నిర్ణయించాం. ఇప్పుడు కరోనా వల్ల పెళ్లి ఆగకూడదనుకున్నాం. అందుకే మేం మా కుటుంబ పెద్దలను మాత్రమే సమావేశపరిచి.. పెళ్లిని ఫోన్‌ ద్వారా జరిపించాం. అనుకున్న సమయానికే పెళ్లి కావడం మరియు తక్కువ ఖర్చుతో జరగడంతో ఇరు కుటుంబాలు కూడా సంతోషంగా ఉన్నాయి అని ఆయన అన్నారు.

For More News..

లాక్ డౌన్ వేళ కారు, లారీ ఢీ.. ఐదుగురు మృతి

ఎలుకలపై కరోనా టీకా సక్సెస్.. ఇక మిగిలింది మనుషులపైనే..

ఫ్రీ బియ్యం స్లో పంపిణీ

బండి ఆపినందుకు పోలీసు గల్లా పట్టుకున్న హైదరాబాద్ మహిళ