ఆసీస్ పరుగుల వరద.. భారత్ కు భారీ టార్గెట్

ఆసీస్ పరుగుల వరద.. భారత్ కు భారీ టార్గెట్

సిడ్నీలో భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది. భారత్  ముందు భారీ 390 పరుగుల టార్గెట్ ను ముందుంచింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు  డేవిడ్ వార్నర్ 83, అరోన్ పించ్ 60 మంచి ఓపెనింగ్ ఇచ్చారు. వీరిద్దరి పాట్నర్ షిప్ లో 142 పరుగులు చేశారు. తర్వాత వార్నర్ రన్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన  స్టీవెన్ స్మిత్ చెలరేగాడు. 64 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. తర్వాత పాండ్యా బౌలింగ్ లో ఔటయ్యాడు. లబుషేన్ కూడా 70 పరుగులు చేశాడు.  ఆఖరిలో మాక్స్ వెల్ సిక్సులు, ఫోర్లతో హోరెత్తించాడు. కేవలం  29 బంతుల్లో 63 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 389 భారీ స్కోర్ చేయగల్గింది.  ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ , బుమ్రా, పాండ్యాకు తలో వికెట్ పడ్డాయి.