యెమెన్ పోర్ట్ సిటీపై సౌదీ బాంబు దాడులు

యెమెన్ పోర్ట్ సిటీపై సౌదీ బాంబు దాడులు

దుబాయ్: యెమెన్ పోర్ట్ సిటీ ముకల్లాపై సౌదీ అరేబియా బాంబులతో దాడి చేసింది. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. యునైటెడ్  అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి యెమెన్‎కు ఆయుధాలు, యుద్ధ సామగ్రి, యుద్ధ వాహనాలను రవాణా చేసిన నౌకలను లక్ష్యంగా చేసుకుని సౌదీ ఈ దాడి చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియా సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. 

దాడికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. యూఏఈ తూర్పు తీరం పుజైరా పోర్ట్ సిటీ నుంచి ఆ నౌకలు చేరుకున్నాయని, వాటిలో ఆయుధాలు, యుద్ధ వాహనాలు తదితర సామగ్రి ఉన్నాయని వెల్లడించింది. సదరన్ ట్రాన్సిషనల్ ఫోర్సెస్  కోసం వాటిని యూఏఈ పంపిందని పేర్కొంది. ఆ ఆయుధాలు తమ దేశానికి ముప్పుగా ఉన్న నేపథ్యంలో మంగళవారం ఉదయం ముకల్లా పోర్ట్ సిటీపై దాడి చేశామని చెప్పింది.