భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ.. అడ్వైజర్‎కు ట్రంప్ అవార్డ్

భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ.. అడ్వైజర్‎కు ట్రంప్ అవార్డ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్​అడ్వైజర్, భారత సంతతికి చెందిన రంజిత్ రికీ సింగ్ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇటీవల ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రత్యేక అవార్డును అందజేశారు. ఆపరేషన్​సిందూర్ తర్వాత భారత్, పాక్​మధ్య కాల్పుల విరమణ చర్చలలో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు అందజేస్తున్నట్టు రూబియో తెలిపారు. 

కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా మధ్యవర్తిత్వం ఆరోపణలను భారత్ మొదటి నుంచీ తిరస్కరిస్తూనే ఉంది. భారత్, పాక్​మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలాసార్లు ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత సంతతికి చెందిన ట్రంప్​సలహాదారుడికి అవార్డు అందజేయడం ట్రంప్ పదేపదే చేసిన వాదనలకు బలం చేకూర్చినట్టయింది.  

37 ఏండ్ల గిల్ పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు జస్బీర్, పరమ్ గిల్ న్యూజెర్సీలోని లోడిలో డాక్టర్లు. ప్రస్తుతం గిల్.. ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ట్రంప్​రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన కీలక సలహా మండలిలో భాగమైన ముగ్గురు భారతీయ- అమెరికన్లలో ఆయన ఒకరు.