AUS vs PAK: దిల్ దిల్ పాకిస్తాన్.. పాక్ ఫీల్డింగ్‌పై నెట్టింట ట్రోల్స్

AUS vs PAK: దిల్ దిల్ పాకిస్తాన్.. పాక్ ఫీల్డింగ్‌పై నెట్టింట ట్రోల్స్

బ్యాటింగ్‌లో విఫలం.. బౌలింగ్‌లో విఫలం.. పోనీ ఫీల్డింగ్ ఒకే అంటేనే అదీ అంతంత మాత్రమే. ఈ పొగడ్తలు ఎవరి గురుంచి అంటారా! మన దాయాది జట్టు పాకిస్తాన్ గురుంచి. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‍లో పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్.. గల్లీ క్రికెట్‌ను తలపించింది.

ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు 3 క్యాచ్‌లు జాడవిరిచారు. అందులో రెండు డేవిడ్ వార్నర్‌వి కాగా, మరొకటి స్టీవ్ స్మిత్‌ది. వార్నర్ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను ఉసామా మీర్ వదిలేశాడు. అందుకు వార్నర్ భారీ సెంచరీ బాధి తగిన భారీ మూల్యం చెల్లించేలా చేశాడు. అనంతరం 100 పరుగులు దాటాక వార్నర్ వారికి మరో అవకాశమిచ్చాడు. అదీ జారవిడిచారు. డీప్ మిడ్ వికెట్‌లో వచ్చిన ఆ క్యాచ్‌ను అబ్దుల్లా షఫీక్ వదిలేశాడు.

 

ఆపై స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను.. కెప్టెన్ బాబర్ అజామ్ జారవిడిచాడు. ఈ ఫీల్డింగ్ పట్ల సొంత దేశ అభిమానులే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత అభిమానులు పాక్ ఫీల్డింగ్ గురుంచి నెట్టింట ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.