రిటైర్మెంట్ ప్రకటించిన డాన్ క్రిస్టియ‌న్  

రిటైర్మెంట్ ప్రకటించిన డాన్ క్రిస్టియ‌న్  

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ డాన్ క్రిస్టియ‌న్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ అనంతరం ఆటకు గుడ్ పై చెప్పనున్నాడు. 39 ఏళ్ల డాన్ క్రిస్టియన్ తన కెరీర్‌లో 405 టీ20 మ్యాచులు ఆడి 5809 పరుగులు చేయడంతో పాటు 280 వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా తరుపున 20 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. న్యూ సౌత్‌వేల్స్‌లో జన్మించిన క్రిస్టియ‌న్ .. పొట్టి క్రికెట్‌లో ఆల్‌రౌండ‌ర్‌గా స‌త్తా చాటాడు. ఐపీఎల్ లో అతను ఢిల్లీ క్యాపిట‌ల్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్‌, రైజింగ్ పూణే సూప‌ర్‌జెయింట్స్ జట్ల తరుపున ఆడాడు. 39 ఏళ్ల క్రిస్టియన్ కోచింగ్‌ సైడ్ వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌కు కోచింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు.