IND vs AUS : వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

IND vs AUS : వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

టీమిండియాతో జరిగే మూడు వన్డే మ్యాచుల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటిచింది. గాయాలనుంచి కోలుకున్న ముగ్గురు సీనియర్ ఆసీస్ ప్లేయర్లు జట్టులో చేరారు. పాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. టెస్టు సిరీస్ లో చెత్త ప్రదర్శన, వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని జట్టును ఎంపిక చేసినట్లు ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. 

ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య తొలి వన్డే మార్చి 17న ముంబైలో జరగనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు వైజాగ్ (మార్చి 19), చెన్నై (మార్చి 22)లో జరగుతాయి.

ఆస్ట్రేలియా వన్డే జట్టు: పాట్ కమిన్స్ (సి), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కెమెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, ఝై రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోనిన్స్ వార్నర్, ఆడమ్ జంపా