
బసెటెరీ (సెయింట్ కిట్స్): ఛేజింగ్‌లో కామెరూన్ గ్రీన్ (55 నాటౌట్), జోస్ ఇంగ్లిస్ (51) చెలరేగడంతో.. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లోనూ ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 4–0 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన విండీస్ 20 ఓవర్లలో 205/9 స్కోరు చేసింది. షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (31), రొవ్‌మన్ పావెల్ (28), రొమారియో షెఫర్డ్ (28), జేసన్ హోల్డర్ (26) మోస్తరుగా ఆడారు. బ్రెండన్ కింగ్ (18), హెట్‌మయర్ (16)తో సహా మిగతా వారు విఫలమయ్యారు.
ఆడమ్ జంపా 3, ఆరోన్ హ్యార్డీ, బార్ట్‌లెట్, సీన్ అబాట్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 206/7 స్కోరు చేసి నెగ్గింది. ఇన్నింగ్స్ రెండో బాల్‌కు మిచెల్ మార్ష్ (0) డకౌట్ కాగా మ్యాక్స్‌వెల్ (47), గ్రీన్, ఇంగ్లిస్ మెరుగ్గా ఆడారు. వీళ్లు ముగ్గురు కలిసి 129 రన్స్ జోడించారు. మిచెల్ ఓవెన్ (2), కూపర్ కనోలీ (0) నిరాశపర్చినా, ఆరోన్ హ్యార్డీ (23) రాణించాడు. జెడియా బ్లేడ్స్ 3 వికెట్లు తీశాడు. మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టీ20 మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది.