
నాగ్ పూర్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ LBWగా ఔట్ చేశాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగుల వద్ద స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను షమీ బౌల్డ్ చేశాడు. దీంతో పర్యాటక జట్టు కేవలం 2 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో లబూషేన్, స్టీవ్ స్మిత్ ఆడుతున్నారు.