పిచ్ రోలర్, ఇనుప రేకులతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రాక్టీస్

పిచ్ రోలర్, ఇనుప రేకులతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు  ప్రాక్టీస్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు ఓటములతో ఇంటా బయట విమర్శలెదుర్కొంటున్న  ఆస్ట్రేలియా మూడో టెస్టులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా  విజయం కోసం నానా తిప్పలు పడుతోంది. ఇండోర్లో  జరిగే మూడో టెస్ట్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాడని భావిస్తున్న ఆసీస్...ప్రత్యేక ప్రాక్టీస్ క్యాంపులతో శ్రమిస్తోంది. 

తప్పిదాలతో మూల్యం..

తొలి రెండు టెస్టులో ఆస్ట్రేలియా  ఓటమికి ఫీల్డింగ్ కూడా ఓ కారణంగా కీలక క్యాచులను  చేజార్చడంతో ఆసీస్ మూల్యం చెల్లించుకుంది. ఈ క్రమంలో  ఇండోర్ టెస్ట్‌లో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆసీస్ ఆటగాళ్లు  గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇండోర్‌ స్టేడియంలో ప్లేయర్లు క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు. 

ప్రత్యేక ప్రాక్టీస్..

ఇండోర్లో ఆసీస్ ఆటగాళ్లు రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా స్లిప్లో క్యాచులు జారవిడవకుండా ఉండేందుకు పిచ్ రోలర్, ఇనుప రేకులతో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ బొర్వెక్ పర్యవేక్షణలో స్మిత్, లబూషేన్, హ్యాండ్స్ కోంబ్  స్లిప్ క్యాచులను ప్రాక్టీస్ చేశారు. ఈ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్లర్లో షేర్ చేసింది.

పిచ్ రోలరే ఎందుకు..?

పిచ్ మీద కంటే రోలర్, ఇనుప రేకులపై బాల్ ఎక్కువగా స్పిన్ అవుతుంది. అయితే  టర్నింగ్ పిచ్‌లపై స్లిప్‌లో క్యాచ్‌లు అందుకోవడానికి ఆసీస్ ఆటగాళ్లు ఇబ్బంది పడుతుండటంతో ఆసీస్ ఈ సరికొత్త విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదేకాకుండా బేస్ బాల్ బ్యాట్‌తో కూడా క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు.