కాళ్లకు ఏడు కోట్ల ఇన్సూరెన్స్ చేసిన బ్యూటీ

V6 Velugu Posted on Jun 12, 2021

మనం ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్, హోం ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఫోన్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వినే ఉంటాం. కానీ ఆస్ట్రేలియాకు చెందిన మిస్ వరల్డ్ మాత్రం తన కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించుకుంది. కాళ్లకు ఇన్సూరెన్స్ ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు చదివేది నిజమే. ఆ అందాల యువతి తన కాళ్లకు ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 7 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ చేయించుకుంది.

బుండా‌బర్గ్‌లో జన్మించిన 22 ఏళ్ల సారా 2019లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా కప్ గెలుచుకుంది. తన శరీరంలో కాళ్లు చాలా అందంగా ఉంటాయని.. అందుకే ఇన్సూరెన్స్ చేయించానని సారా చెప్పడం విశేషం. కాగా.. సారా ఫ్యామిలీలో చాలా మంది రగ్బీ ఆటగాళ్లే ఉండగా.. ఆమె మాత్రం ఫుట్‌బాల్ వైపు అడుగులేసింది. సారా మార్ష్కే త్వరలోనే ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ ఉమెన్స్ లీగ్‌లో ఆడబోతోంది. 

‘నేను చాలా సన్నగా, పొడవుగా ఉండేదాన్ని. దాంతో అందరూ నన్ను హేళన చేసేవారు. నీ కాళ్లేంటి అంత పొడవుగా, సన్నగా ఉన్నాయని ఏడిపించేవారు. కానీ నా కాళ్లే నాకు అందాన్ని ఇస్తాయని అప్పుడు అనుకోలేదు. అప్పుడు హేళన చేసినవాళ్లే.. ఇప్పుడు నా కాళ్లను ప్రేమిస్తున్నారు. నా పొడవైన కాళ్ల వల్లే నేను ఫుట్‌బాల్ లో రాణించగలుగుతున్నాను. నేను నా ఆటతో ప్రేమలో పడ్డాను. అప్పటినుంచి దానిపై మక్కువ పెంచుకున్నాను. అందుకే నేను నా కాళ్లకు మిలియన్ డాలర్ల ఇన్సూరెన్స్ చేయించాను’ అని సారా ఆనందంగా చెప్పుకొచ్చింది.

సారా ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 16,000 మంది ఫాలోవర్లను కలిగి ఉంది. ఆమె తన పేజీలో స్టైలిష్‌గా ఉన్న మోడలింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

Tagged australia, Sarah Marschke, Legs Insurance, legs insured For 1 Million dollars, Bundaberg, AFLW, insurance for legs, 7 crores insurance for legs, కాళ్లకు ఇన్సూరెన్స్, leg insurance

Latest Videos

Subscribe Now

More News