ఇండియన్ కోసం ఆస్ట్రేలియా పోలీసుల వేట

ఇండియన్ కోసం ఆస్ట్రేలియా పోలీసుల వేట

మెల్ బోర్న్: మర్డర్ కేసులో నిందితుడిగా భావిస్తున్న ఇండియన్ కోసం ఆస్ట్రేలియా పోలీసులు గాలిస్తున్నారు. అతని ఆచూకీ చెబితే ఏకంగా రూ.5.24 కోట్ల రివార్డు అందజేస్తామని గురువారం ప్రకటించారు. 2018 అక్టోబర్ 21న క్వీన్స్ లాండ్ లోని బీచ్ లో ఫార్మసీలో పని చేసే 24 ఏండ్ల యువతి తోయా కార్డింగ్లీ హత్యకు గురైంది. ఈ కేసులో మన దేశానికి చెందిన రజ్వీందర్ సింగ్ (38)ను ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో నర్సుగా పని చేసిన రజ్వీందర్ సింగ్.. కార్డింగ్లీ హత్య జరిగిన రెండ్రోజుల తర్వాత తన భార్యాబిడ్డలను అక్కడే వదిలి ఇండియాకు పారిపోయాడని పోలీసులు తెలిపారు. రజ్వీందర్ పంజాబ్ కు చెందినవాడని చెప్పారు. ‘‘రజ్వీందర్ ఇండియాలో ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. అతని గురించి తెలిసినోళ్లు చెప్పండి” అని కోరారు. దేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో రివార్డు ప్రకటించలేదని వాళ్లు పేర్కొన్నారు.