నిజాంసాగర్ కాల్వ స్థలంలో ఆక్రమణల తొలగింపు

నిజాంసాగర్ కాల్వ స్థలంలో ఆక్రమణల తొలగింపు

ఆర్మూర్, వెలుగు:  ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ శివారులో 63 వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్​ స్థలంలో వేసిన ఆక్రమణలను మంగళవారం అధికారులు తొలగించారు.

 రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా ఆక్రమణలను  తొలగించి ఎకరం 38 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ, ఇరిగేషన్ డీఈ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ రాజు కలిసి జేసీబీలతో ఆక్రమణలు తీయించి, విధులకు ఆటంకం కలిగించిన భూ యజమాని పై ఫిర్యాదు చేశారు.