10వ తరగతి పరీక్ష రాసి వెళ్తుండగా ప్రమాదం.. విద్యార్థిని మృతి

10వ తరగతి పరీక్ష రాసి వెళ్తుండగా ప్రమాదం.. విద్యార్థిని మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మలహార్ మండలం తాడిచెర్లలో 10వ తరగతి విద్యార్థులతో  వెళ్తున్న ఆటో బోల్తా పాడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు గాయాలైయ్యాయి. గాయపడిన విద్యర్థులను వెంటనే భూపాలపల్లి హాస్పిటల్ కు తరలించారు. విదార్థులు ఏప్రిల్ 10వ తేదీ సోమవారం పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. 

మరోచోట కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బారెడు పోచమ్మ దేవాలయం దగ్గరలో ఆటో బోల్తా పడి విద్యార్థిని మృతి చెందింది. పదవ తరగతి పరీక్ష రాసి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. ఆటోలో సుమారుగా 8 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గోపాల్ పల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని శిరీష మరణించింది. మిగతా విద్యార్థులకు స్వల్పంగా గాయాలైయ్యాయి. గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించారు.