
- మరో 11 మందికి తీవ్రగాయాలు
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్-బలోదాబజార్ హైవేపై సరగావ్ గ్రామం వద్ద ట్రైయిలర్ట్రక్కు, మినీ ట్రక్కు(స్వరాజ్ మజ్దా గూడ్స్) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. విధాన్సభా ఏరియాలోని చతౌడీ గ్రామానికి చెందిన దాదాపు 50 మంది మినీ ట్రక్కులో బనారసీ గ్రామంలో జరిగిన ఓ వేడుకకు వెళ్లారు. వేడుక ముగిశాక తిరిగి తమ గ్రామానికి వెళ్తున్న క్రమంలో వీరి వెహికల్..భారీ యంత్రాలతో వెళ్తున్న ట్రైయిలర్ట్రక్కును బలంగా ఢీకొట్టిందని అధికారులు వెల్లడించారు.
13 మంది అక్కడికక్కడే మృతి చెందారని..మృతుల్లో 9 మంది మహిళలు, నలుగురు చిన్న పిల్లలు ఉన్నట్లు వివరించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిని రాయ్‌పూర్‌లోని అంబేద్కర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. యాక్సిడెంట్ అనంతరం ట్రైయిలర్ ట్రక్కు డ్రైవర్అమిత్కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.