చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఆటోడ్రైవర్‌‌‌‌‌‌‌‌ మృతి..సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో విషాదం

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఆటోడ్రైవర్‌‌‌‌‌‌‌‌ మృతి..సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో విషాదం

ఎల్లారెడ్డిపేట, వెలుగు : చికెన్‌‌‌‌‌‌‌‌ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన పాటి సురేందర్‌‌‌‌‌‌‌‌ (42) ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో ఇంట్లో చికెన్‌‌‌‌‌‌‌‌ వండారు. సాయంత్రం చికెన్‌‌‌‌‌‌‌‌ తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడకపోవడంతో సురేందర్‌‌‌‌‌‌‌‌ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య కవిత, కూతుర్లు రుచిత, శిరీష ఉన్నారు.