ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇవ్వాలి

ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇవ్వాలి

బషీర్​బాగ్​, వెలుగు: ఏపీ తరహాలో తెలంగాణలో ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించాలని ఆటో డ్రైవర్స్​ జేఏసీ తెలంగాణ కన్వీనర్​ మొహమ్మద్​ అమనుల్లా ఖాన్​ డిమాండ్  చేశారు. హైదర్ గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.ఆటో మీటర్ల చార్జీలు పెంచి, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు లతీఫ్, యహియా, అక్తర్, సలీం తదితరులు పాల్గొన్నారు.