ఆటమ్ ఈ బైక్స్ కి ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ అవార్డు

ఆటమ్ ఈ బైక్స్ కి ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ అవార్డు

ఆటమ్ ఈ బైక్స్ కంపెనీకి  ‘ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023’ అందుకుంది. ‘డిజైన్ ఎక్సలెన్స్ అవార్డు' విభాగంలో విజేతగా నిలిచింది. ఈ అవార్డును కంపెనీ ప్రతినిధులు ఏప్రిల్ 26వ తేదీ బుధవారం సాయంత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులు, ఇతర సిబ్బందికి విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీ అభినందనలు తెలియజేశారు. 

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహితంగా అన్ని వాహనాలు ఎలక్ట్రానిక్స్ గా మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే యూత్ కు బాగా నచ్చేటువంటి EV వాహనాలను ఆటమ్ మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇప్పుడు ఇవే వాహనాలు మార్కెట్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా.. గుర్తింపుగానే ఆటమ్ మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ‘ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023’కు ఎంపికైంది. అనతీకాలంలోనే మార్కెట్ లోకి విడుదలైన కొద్దీరోజుల్లో వినయోగదారుల విశేష ఆదరణ పొందింది. 

ఎలక్ట్రిక్ వాహనల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. పర్యావరణహితమైన ఈ ఎలక్ట్రిక్ వాహనాలను జనానికి మరింత చేరువ చేసేందుకు ఆటమ్ సంస్థ కొత్త బైక్స్ ను ఎప్పటికప్పుడూ  లాంఛ్ చేస్తోంది. 2023, ఫిబ్రవరిలో నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఆటమ్ ఈ బైక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. తక్కువ ఖర్చు మోడ్రన్ లుక్ ఉండే ఆటమ్ బైక్స్ ఆర్డర్స్ ఇప్పుడు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా న్యూ మోడ్రన్ లుక్ తో ఉన్న ఆటమ్ 1.0, ఆటమ్ వేడర్ మోడల్స్ యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. 2022లోనూ న్యూ వేరియంట్ బైక్ ఆటమ్ వేడర్ ఫస్ట్ టైమ్ నుమాయిష్ లో ప్రదర్శించారు. 

ఆటమ్ బైక్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ వెళ్తుంది. స్పీడ్ 65 కి.మీ పర్ అవర్ గా ఉంది. ఎల్ ఈడీ లైట్స్, ఎల్ ఈడీ ఇండికేటర్స్, ఎల్ ఈడీ డిస్ల్పే తో అట్రాక్టివ్ లుక్ తో న్యూ మోడల్ బైక్ ను డిజైన్ చేశారు. ఇందులో 14 లీటర్ గూడ్స్ స్పేస్, 2.4కేవి లిథియ్ బ్యాటరీ ఉంటుంది. 100 శాతం బైక్ పార్ట్స్ మేడిన్ ఇండియా కావడం విశేషం. బైక్ స్పీడ్ మోడ్ 1, 2, 3  లెవెల్స్ లో 25 కి.మీ నుండి 65 స్పీడ్ వరకు రైడ్ చేయొచ్చు.

ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఈవీ) రంగంలో విశాఖ గ్రూప్ కు చెందిన ‘ఆటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మొబైల్’  కంపెనీ బైక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. పర్యావరణ కాలుష్యం పట్ల అందరిలో అవగాహన పెరగడంతో జీవితంలో వీలైనంత ఎక్కువగా ఎకో–ఫ్రెండ్లీగా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్స్‌‌పై ప్రపంచవ్యాప్తంగా ఫోకస్‌‌ పెరగడం గమనించొచ్చు.