ఆటోమొబైల్ ​సేవలు అందించే మాలిక్ గ్రూప్కు వాహన్ లీడర్ అవార్డు

ఆటోమొబైల్ ​సేవలు అందించే మాలిక్ గ్రూప్కు వాహన్ లీడర్ అవార్డు

హైదరాబాద్, వెలుగు: ఆటోమొబైల్ ​సేవలు అందించే హైదరాబాద్‌‌‌‌ సంస్థ మాలిక్ గ్రూప్ వాహన్ లీడర్ ప్లాట్‌‌‌‌ఫామ్ విజేత అవార్డును గెలుచుకుంది. వాహన్​ ప్లాట్​ఫారమ్​ద్వారా రికార్టుస్థాయి బ్లూ-కాలర్ ఉద్యోగాలను ఇచ్చినందుకు టాటా పంచ్‌‌‌‌ కారును గెలుచుకుంది. వాహన్​ డాట్​ఏఐ ప్రతి నెలా 40 వేల మంది యువతకు బ్లూకాలర్​ఉద్యోగాలను కల్పిస్తోంది.

మాలిక్ గ్రూప్‌‌‌‌కు చెందిన ఇర్ఫాన్ మాలిక్ మాట్లాడుతూ, వాహన్ మద్దతుతో తమ వ్యాపారం ఒక సంవత్సరంలోనే నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు. వాహన్ వ్యవస్థాపకుడు, సీఈఓ మాధవ్ కృష్ణ స్వయంగా వచ్చి తమను అభినందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. గత నవంబర్ నుంచి ఈఏడాది ఫిబ్రవరి వరకు అత్యధిక సంఖ్యలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు ఇచ్చినందుకు తమ గ్రూప్ ఈ అవార్డును గెలుచుకుందని వివరించారు.