సోలార్​తో ఆటమ్‌‌ చార్జింగ్‌‌ స్టేషన్‌‌

సోలార్​తో ఆటమ్‌‌ చార్జింగ్‌‌ స్టేషన్‌‌
  • ఇది ప్రపంచంలోనే ఫస్ట్‌‌ గ్రీన్‌‌ 
  • ఎనర్జీ స్టేషన్‌‌ ఇక్కడే వర్క్‌‌స్టేషన్‌‌, 
  •  సర్వీసింగ్‌‌ సెంటర్‌‌  నెలలో దేశవ్యాప్తంగా 25 స్టేషన్లు
  •  ఏడాది చివరి నాటికి 50 స్టేషన్లు
  •  వెల్లడించిన విశాక ఇండస్ట్రీస్‌‌ జేఎండీ వంశీ గడ్డం
  •  చార్జింగ్‌‌ స్టేషన్‌‌ను ప్రారంభించిన విశాక చైర్మన్‌‌ వివేక్‌‌ వెంకటస్వామి

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రపంచంలోనే తొలిసారిగా సోలార్‌‌ పవర్‌‌తో నడిచే ఎలక్ట్రిక్‌‌ వెహికల్‌‌ చార్జింగ్‌‌ స్టేషన్‌‌ను విశాక గ్రూప్‌‌ సబ్సిడరీ ఆటమ్‌‌చార్జ్‌‌ అందుబాటులోకి తెచ్చింది. గ్రూప్‌‌ చైర్మన్‌‌ గడ్డం వివేక్‌‌ వెంకటస్వామి, ఎండీ సరోజా వివేకానంద్‌‌ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌‌లోని బేగంపేటలో దీనిని  ప్రారంభించారు.  ఇతర కంపెనీల చార్జింగ్‌‌ స్టేషన్లు థర్మల్‌‌ పవర్‌‌ను వాడతాయి. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. విశాక గ్రూపు ఆటమ్ రూఫ్‌‌, వండర్‌‌ యార్న్‌‌ వంటి పర్యావరణ అనుకూల ప్రొడక్టులను తయారు చేస్తుంది.  ఆటమ్ సోలార్‌‌ రూఫ్‌‌కు పేటెంట్లు కూడా ఉన్నాయి. ఇంటి పైకప్పు కోసం, సోలార్‌‌ కరెంటు తయారీ కోసమూ దీనిని వాడుకోవచ్చు. ఈ సందర్భంగా వివేక్‌‌ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ ‘‘భవిష్యత్‌‌ పూర్తిగా సోలార్‌‌, రెన్యువబుల్‌‌ ఎనర్జీలదే! మా గ్రూపు ఆటమ్‌‌ పేరు ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్‌‌ను తయారు చేసింది. ఆటమ్‌‌ చార్జ్‌‌ ద్వారా మేం దేశమంతటా ఈవీ చార్జింగ్‌‌ ఇన్‌‌ఫ్రాను పెంచుతాం. పెట్రో ఇంధనాల వాడకాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.  
వచ్చే నెలలో హైస్పీడ్‌‌ ఆటమ్‌‌ బైక్‌‌
ఈ సందర్భంగా కంపెనీ జాయింట్‌‌ ఎండీ గడ్డం వంశీ మీడియాతో మాట్లాడుతూ- ఆటమ్‌‌ చార్జింగ్‌‌ స్టేషన్లలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను ఛార్జ్ చేసుకోవచ్చని చెప్పారు. హైస్పీడ్‌‌తో ప్రయాణించే ‘ఆటమ్‌‌ 2.0’  బైకు వెర్షన్‌‌ ను వచ్చే నెలలో లాంచ్‌‌ చేస్తామని వెల్లడించారు ‘‘-ఈ చార్జింగ్‌‌ స్టేషన్‌‌లో రోజుకు 10 బైకులను వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రాంచైజీ పద్ధతిలోనూ ఆటమ్‌‌ చార్జింగ్‌‌ స్టేషన్లను పెట్టుకోవచ్చు. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది’’ అని వివరించారు.  ‘‘ఈవీలను చార్జ్‌‌ చేసేందుకు స్పెషల్‌‌ ఇకో సిస్టం రూపొందిస్తున్నాం. మిగతా కంపెనీల్లా థర్మల్‌‌ పవర్ వాడకుండా, మా సంస్థ   గ్రీన్‌‌ ఎనర్జీతో చార్జింగ్‌‌ స్టేషన్లను పెడుతోంది. చార్జింగ్‌‌ అయ్యేలోపు ఇక్కడే పని చేసుకునేందుకు వర్క్‌‌ స్టేషన్‌‌ నిర్మిస్తాం. వెహికల్ రిపేర్‌‌ సర్వీసును కూడా అందించబోతున్నాం. ఈనెలాఖరుకు అన్ని మెట్రో నగరాల్లో 25 చార్జింగ్‌‌ స్టేషన్లను, ఈ ఏడాది చివరి నాటికి 50 స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌‌లో ఇంకో నాలుగు స్టేషన్లు నిర్మిస్తాం. ఆటమ్‌‌ ఎనర్జీకి ఇండియాతో పాటు సౌత్‌‌ ఆఫ్రికాలో పేటెంట్‌‌ వచ్చింది. అమెరికా, చైనా తదితర దేశాల్లో రావాల్సి ఉంది.  మా చార్జింగ్‌‌ కేంద్రాల్లో ఏడాది పాటు ఆటమ్‌‌ బైక్‌‌లను ఉచితంగా చార్జింగ్‌‌ చేసుకోవచ్చు.  పెట్రోల్‌‌ బైక్‌‌తో పోలిస్తే ఎలక్ట్రిక్‌‌ బైక్‌‌  ఫ్యూయల్​ ఖర్చు చాలా తక్కువ.  ఆటమ్‌‌ బైక్‌‌ బుక్‌‌ చేసుకున్న వారికి ఇంటికే డోర్‌‌ డెలివరీ చేస్తాం. ఏడాదిలోనే 600 బైక్‌‌లు సేల్‌‌ చేశాం’’ అని ఆయన వివరించారు.