Avadhut Sathe: సెబీ దాడులపై రియాక్ట్ అయిన మార్కెట్ గురు అవధూత్ సాథే.. అసలు ఎవరు ఈయన..?

Avadhut Sathe: సెబీ దాడులపై రియాక్ట్ అయిన మార్కెట్ గురు అవధూత్ సాథే.. అసలు ఎవరు ఈయన..?

SEBI On Finfluencer: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ మార్కెట్ గురు అవధూత్ సాథేకు సంబంధించిన కర్జాత్ ప్రాంగణంలోని అకాడమీలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పూణేకు చెందిన ఈ ఫిన్‌ఫ్లూయెన్సర్ రెగ్యులేటరీ స్కానర్ కిందకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆయన ట్రేడింగ్ గురించి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మధ్యలో డాన్స్ చేయటం, పెద్ద స్కీన్ పై చార్ట్స్ చూపిస్తూ తన విద్యార్థులను వేదికపైకి పిలవటం వంటి ప్రత్యేకమైన విధానంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ట్రైనింగ్ ఇస్తూ ప్రసిద్ధి చెందారు. 

ఆగస్టు 20 తెల్లవారు జామున సాథేకు చెందిన కర్జాత్ ట్రేడింగ్ అకాడమీలో సోదాలు నిర్వహించిన తర్వాత తాజాగా ఆయన ఈ అంశంపై స్పందించారు. తమ అకాడమీ స్టాక్ టిప్స్ ఇవ్వటం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ లేదా ఖచ్చితంగా లాభాలను తెప్పిస్తామంటూ ఎలాంటి అక్రమ విధానాలకు పాల్పడటం లేదని సెబీ సోదాల తర్వాత వివరణ ఇచ్చింది. తాము ఒక ఖచ్చితమైన ట్రైనింగ్ విధానం ద్వారా ఇండిపెండెంట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు పెట్టుబడులకు సంబంధించి శిక్షణ మాత్రమే ఇస్తున్నట్లు ట్రేడింగ్ అకాడమీ చెబుతోంది. అవధూత్ సాథే ఫిన్‌ఫ్లూయెన్సర్ కాదని కూడా చెబుతూ వార్తా కథనాల్లో ఆయనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వివరణ ఇచ్చారు. 

ప్రస్తుతం తాము సెబీకి దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తున్నామని, తాము కేవలం ఇన్వెస్టర్లకు సరైన జ్ఞానాన్ని, మైండ్ సెట్, క్రమశిక్షణను మాత్రమే క్యాపిటల్ మార్కెట్ల గురించి నేర్పిస్తున్నట్లు అకాడమీ వెల్లడించింది. ఇది మార్కెట్ల ఆరోగ్యకరమైన పురోగతికి సహాయపడుతుందని వివరించింది. గతవారం రెండు రోజుల పాటు అకాడమీ ప్రాంగణాల్లో జరిపిన సోదాల్లో సెబీ ఏం గుర్తించిందనే వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. 

ALSO READ : హైదరాబాద్లో గోల్డ్ తాకట్టు పెట్టేటోళ్లు జర భద్రం..

అవధూత్ సాథే వాస్తవానికి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేశారు. సింగపూర్, ఆస్ట్రేలియా, యూఎస్ లో ఉన్న తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు. 2007లో ఉద్యోగం మానేసి ఫుల్ టైం ట్రేడర్ అలాగే ట్రైనర్ అయ్యారు. ట్రేడింగ్ లోకి వచ్చిన కొత్తలో ఆయన నష్టాలను కూడా చూశారు. ప్రస్తుతం ఆయన అకాడమీ హిందీ, ఇంగ్లీష్, మరాఠీలో కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 18వేల మందికి ట్రేడింగ్ గురించి ట్రైనింగ్ ఇచ్చారు 52 ఏళ్ల థానే. నాలుగు మాడ్యూల్స్ కింద ఉండే ట్రేడింగ్ శిక్షణ కోర్సులో ఒక్కో మాడ్యూల్ రూ.18వేలకు సాథే అకాడమీ ఆఫర్ చేస్తోంది.