
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఏవియేషన్ రంగం ఎంతో అభివృద్ది చెందిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. హైదరాబాద్ లోని బేగంపేటలో విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా2024 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో ప్రస్తుతం అమృత కాల్ కు చేరుకున్నామని చెప్పారు.
ప్రజల మద్య దూరం తగ్గించేది ఏవియేషన్ అని జ్యోతిరాదిత్య చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు కనెక్టివిటీ పెరిగిందని తెలిపారు. విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. 2014 లో 60 మిలియన్ ప్రయాణాలు రాకపోకలు సాగించేవారని ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు అయ్యిందని చెప్పారు.
ప్రపంచంలోని సివిల్ ఏవియేషన్ లో భారత్ 5వ స్థానంలో ఉందని అన్నారు. 9 ఏళ్లలో 3 వందల మిలియన్ డొమెస్టిక్ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని చెప్పారు. 2047 వరకు భారత దేశం ఏవియేషన్ లో మరింత ముందుకి సాగుతుందని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.