చెన్నై: ఇండియా స్క్వాష్ టీమ్ చరిత్ర సృష్టించింది. తొలిసారి స్క్వాష్ వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 3–0 తో హాంకాంగ్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. 2023లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న ఇండియా ఈసారి స్క్వాష్ లో సరికొత్త మైలురాయిని అధిగమించింది.
తొలి పోరులో సీనియర్ ప్లేయర్ జోష్న 7–-3, 2–-7, 7–-5, 7–-1తో తనకంటే మెరుగైన ర్యాంకర్ కై లీపై విజయం సాధించింది. ఆపై, 27 ఏండ్ల అభయ్ సింగ్ తన పవర్‌ఫుల్ షాట్లతో 7-–1, 7–-4, 7–-4 తో ఆసియా చాంప్ అలెక్స్ లూను ఓడించాడు. చివరి మ్యాచ్‌లో 17 ఏండ్ల యువ సంచలనం అనాహత్ సింగ్ 7-–2, 7–-2, 7–-5తో తొమాటో హోను చిత్తు చేసి ఇండియాకు గోల్డ్ అందించింది.
