సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ గెలుపు జోరు

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ గెలుపు జోరు

అంబి (పుణె): సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ హవా నడుస్తోంది. ఆదివారం జరిగిన సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి పోరులో  తన్మయ్ అగర్వాల్ (73), రాహుల్ బుద్ది (55) ఫిఫ్టీలతో సత్తా చాటడంతో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. తొలుత రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 178/9 స్కోరు చేసింది. మహిపాల్ లోమ్రోర్ (48), నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోటి (29), కునాల్ (27) రాణించారు. కెప్టెన్ సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్ చెరో మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ 17.1 ఓవర్లలోనే 179/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. తన్మయ్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది. మంగళవారం హర్యానాతో హైదరాబాద్ పోటీ పడనుంది. 

జైస్వాల్ సెంచరీ.. ముంబై విక్టరీ


తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడిన ముంబై పుంజుకుంది. టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ (50 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 16 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 101) సెంచరీతో విజృంభించడంతో 4 వికెట్ల తేడాతో హర్యానాను ఓడించింది. తొలుత హర్యానా 234/3 స్కోరు చేయగా.. జైస్వాల్‌‌‌‌‌‌‌‌కు తోడు సర్ఫరాజ్ ఖాన్ (64) మెరుపులతో ముంబై 17.3 ఓవర్లలోనే 238/6 స్కోరు చేసి గెలిచింది.