హెచ్-1బీ, హెచ్-4 వీసాలు టెంపరరీగా రద్దు

హెచ్-1బీ, హెచ్-4 వీసాలు టెంపరరీగా రద్దు

న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెరికా వెళ్లే నిపుణులకు జారీ చేసే హెచ్1బీ, హెచ్4 వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశారు. అమెరికాలో ఉన్న హెచ్1బీ, హెచ్4 వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వెళ్తున్నాయి. 

అందులో వారి వర్క్ వీసాలను ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. దీని వల్ల వేలాది మంది వీసాలపై ఎఫెక్ట్​ పడుతున్నది. అయితే, ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను ‘ప్రుడెన్షియల్ రివోక్’గా పిలుస్తున్నారు. ఇది కేవలం తాత్కాలిక, ముందుజాగ్రత్త చర్య మాత్రమేనని అధికారులు చెప్పారు.