ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు విచారించిన సీబీఐ

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు విచారించిన సీబీఐ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. శనివారం ( జూన్ 10)  ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాష్ రెడ్డి సుదీర్ఘంగా విచారించారు అధికారులు. సుమారు 7 గంటల పాటు సీబీఐ విచారణ సాగింది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని హైకోర్టు గత నెల 31న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

గత శనివారం ( జూన్ 3)  కూడా అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. ముందస్తు బెయిల్ సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి ప్రతీ శనివారం సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7 గంటల పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది.