కామన్వెల్త్ : భారత్కు మరో సిల్వర్ మెడల్

కామన్వెల్త్ : భారత్కు మరో సిల్వర్ మెడల్

కామన్వెల్త్ గేమ్స్లో మెన్స్ 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాష్ సాబ్లే రజతం సాధించాడు. అతను 3వేల మీటర్ల రేసును 8:11.20 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇది అవినాష్ సాబ్లే వ్యక్తిగత అత్యుత్తమంతో పాటు..జాతీయ రికార్డు కావడం విశేషం. 

కామన్వెల్త్ గేమ్స్లో  అవినాష్ సాబ్లే బరిలోకి దిగాడంటే పతకం పక్కా. ప్రతీ కామన్వెల్త్ లో సిల్వర్ మెడల్ సాధిస్తూ వస్తున్నాడు. అయితే 2018లో గోల్ కోస్ట్ గేమ్స్లో మాత్రమే అవినాష్  పతకం సాధించలేకపోయాడు. ఆ క్రీడల్లో 5వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్లో భారత్కు ఇది నాలుగో మెడల్.  హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్యం, లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్ రజతం, 10,000 మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి రజతం గెలుచుకోగా..తాజాగా అవినాష్ సాబ్లే సిల్వర్ సాధించాడు. 

అటు ఒరెగాన్‌లోని యూజీన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో అవినాష్ ఫైనల్లో 11వ స్థానంలో నిలిచాడు.