కాస్ట్​ మేనేజ్​మెంట్​లో ఎన్​సీసీకి అవార్డు

కాస్ట్​ మేనేజ్​మెంట్​లో ఎన్​సీసీకి అవార్డు

హైదరాబాద్​కు చెందిన ఎన్​సీసీ...  నేషనల్​ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌‌లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్‌‌మెంట్​లోని "ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ & కన్స్ట్రక్షన్" విభాగంలో మొదటి స్థానాన్ని గెలుచుకుంది. ఈ అవార్డు ప్రధానోత్సవాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌లో ది ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ నిర్వహించింది. ఎన్​సీసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్  రాజు డైరెక్టర్ (ప్రాజెక్ట్స్), సీఎఫ్​ఓ సంజయ్ పుసర్ల, సీజీఎం శ్రీనివాసరావు పాల్గొని అవార్డును తీసుకుకున్నారు. ఎన్​సీసీ ఇంతకుముందు ఈ జాతీయ అవార్డును రెండుసార్లు పొందింది

హెచ్​పీ నుంచి 3 ల్యాప్​టాప్​లు

ఎలక్ట్రానిక్స్​ కంపెనీ హెచ్​పీ ఇండియా మార్కెట్లో ఓమెన్​ సిరీస్​లో రెండు  ల్యాప్​టాప్​ను, మరో ఒమెన్​ ల్యాప్​టాప్​ను లాంచ్​ చేసింది. ధరలు రూ.60 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉన్నాయి. ఇవి గేమింగ్​ ల్యాప్​టాప్​లు. స్మూత్ ​గేమ్​ప్లే, ఎక్కువ రిజల్యూషన్​, ఫాస్ట్ ​ప్రాసెసర్లు, లేటెస్ట్​ డిజైన్లు, బ్రైట్​ విజువల్స్​ వంటివి వీటి ప్రత్యేకతలు. ల్యాప్​టాప్​లతో పాటు హైపర్​ ఎక్స్​ వైర్​లెస్​ గేమింగ్​ హెడ్​సెట్​ను, డిస్​ప్లే మానిటర్​ను కూడా హెచ్​పీ అందుబాటులోకి తెచ్చింది.